Kavitha News Latest | బీఆరెస్ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన కవిత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావును ఉద్దేశించి తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత మరో బాంబ్ పేల్చారు. తాను తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖను లీక్ చేసిందే సంతోష్ రావు అని పేర్కొన్నారు.
అలాగే ఫార్మహౌస్ లో జరిగుతున్న ప్రతీ సమాచారం కాంగ్రెస్ నేతలకు చేరుతుందన్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు, సంతోష్ పాల్పడుతున్న అవినీతి గురించి కేసీఆర్ కు వివరించినట్లు చెప్పారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో వీరి అరాచకాలపై పోరాడనున్నట్లు కవిత స్పష్టం చేశారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అవినీతిపై పల్ల రాజేశ్వర్ రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. జనగామ టికెట్ విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని కారణంగానే పల్లా తనకు పోచంపల్లి అవినీతికి సంబంధించిన వివరాలను పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు.









