Karni Sena Announces Rs.1cr Of Reward To Kill Lawrence | మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిధ్దఖి ( Baba Siddique ) హత్యతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది.
ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైలులో లారెన్స్ ఉన్నాడు. జైలులో ఉన్న సమయంలోనే తన గ్యాంగ్ సభ్యుల ద్వారా నేర కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు. అయితే ఇదే సమయంలో లారెన్స్ బిష్ణోయ్ ను ఎంకౌంటర్ ( Encounter ) చేసిన వారికి రూ. కోటి రివార్డు ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈ మేరకు క్షత్రియ కర్ణి సేనా సమితి జాతీయ అధ్యక్షులు రాజ్ షేకావత్ ( Raj Shekawat ) ఒక వీడియోను విడుదల చేశారు. లారెన్స్ బిష్ణోయ్ ను ఎంకౌంటర్ చేసిన పోలీసు అధికారికి కుటుంబ భద్రత, భవిష్యత్ కోసం రూ. కోటి ఇస్తామని ఆయన ప్రకటించారు.
లారెన్స్ ఎన్ని నేరాలకు పాల్పడినా కేంద్ర ప్రభుత్వం, జైలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాగా 2023 డిసెంబర్ లో రాష్ట్రీయ రాజపుత్ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
అయితే ఈ హత్య తమ పనే అంటూ లారెన్స్ గ్యాంగ్ ప్రకటించింది. మా అధ్యక్షడ్ని చంపిన వారిని వదిలేదే లేదు అని తాజాగా రాజ్ షేకావత్ ప్రకటించారు.