Karimnagar Collector Pamela Tatpathy News | కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తీసుకున్న ఓ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏవైనా పనుల కోసం కలెక్టరేట్ కు వెళ్తే అధికారులు అందుబాటులో లేకపోతే వారికోసం గంటల కొద్దీ వేచి చూడాలి.
ఈ ఖాళీ సమయంలో ఏమి చేయాలో తోచదు. కొన్ని సందర్భాల్లో పనులు పూర్తి చేసుక్కవడానికి వచ్చిన సందర్శకులకు విసుగు కూడా కలుగుతుంది. అధికారులు సమావేశాల్లో ఉంటేనో లేదా అందుబాటులో లేకుంటే సందర్శకులు ఇబ్బంది పడకూడదని భావించారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్ లో గతంలో స్టోర్ రూమ్ గా ఉపయోగించిన గదిని ఇప్పుడు లైబ్రరీగా మార్చారు. ఎనమిది నెలల క్రితం వివిధ అంశాలకు చెందిన సుమారు 200 పుస్తకాలను గ్రంధాలయంలో ఏర్పాటు చేశారు.
దింతో అధికారుల కోసం నిరీక్షించే సందర్శకులు ఇప్పుడు ఎంచక్కా పుస్తకాలను చదువుకుంటున్నారు. కలెక్టర్ ఆలోచన పట్ల కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా హర్షం వ్యక్తం చేశారు.