Karate Kalyani files Complaint Against YouTuber Naa Anveshana | యూట్యూబర్ ‘నా అన్వేష్’ పై నెటిజన్లు భగ్గుమంటున్నారు. లక్షల్లో అతన్ని అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. తాజగా నా అన్వేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రముఖ నటి కరాటే కళ్యాణి. నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రాధరణపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెల్సిందే. శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంలోకి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కూడా లాగి ఆయనపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఆలయాలపై ఉండే శిల్పాలను మరియు రామాయణం, మహా భారతాలను ప్రస్తావిస్తూ సీతాదేవి, ద్రౌపదిలపై కూడా దారుణ వ్యాఖ్యలు చేశాడు ఇతడు. దింతో అన్వేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం, ఖమ్మం జిల్లాలో అన్వేష్ పై ఇప్పటికే కేసు నమోదైంది. తాజగా అన్వేష్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ నటి కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.








