Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మార్నింగ్ వాక్ ను వదులుకున్న కాబోయే చీఫ్ జస్టిస్..కారణమేంటో తెలుసా ?

మార్నింగ్ వాక్ ను వదులుకున్న కాబోయే చీఫ్ జస్టిస్..కారణమేంటో తెలుసా ?

Justice Khanna Gave Up Morning Walk | దేశానికి కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా ( Justice Khanna ) గురించి ఓ ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది.

ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ( CJI DY Chandrachud ) నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న విషయం తెల్సిందే. తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ ఖన్నా నవంబర్ 11న బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ ఖన్నా ప్రతిరోజూ మార్నింగ్ వాక్ చేస్తారు.

లోధి గార్డెన్ వద్ద ప్రతిరోజూ జస్టిస్ ఖన్నా ఒంటరిగా కొన్ని కీ. మీ. మార్నింగ్ వాక్ ( Morning Walk ) చేస్తారు. అయితే త్వరలో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఆయన్ను గుర్తుపట్టే అవకాశం ఉంది.

ఇలా అయితే సెక్యూరిటీ సిబ్బందిని వెంట పెట్టుకుని మార్నింగ్ వాక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా వాక్ చేయడం ఆయనకు ఇష్టం లేదు. ఈ క్రమంలో జస్టిస్ ఖన్నా పూర్తిగా మార్నింగ్ వాక్ ను మానివేయలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions