Jofra Archer set to play a Test after four years | అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్-టీం ఇండియా మధ్య ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.
తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించగా, రెండవ మ్యాచులో టీం ఇండియా సత్తా చాటింది. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లండన్ లోని ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న మ్యాచు కోసం ఇంగ్లాండ్ జట్టు సిద్దమయ్యింది.
ఈ మేరకు ప్లేయింగ్ లెవన్ ను ఆ జట్టు ప్రకటించింది. జోష్ టంగ్ స్థానంలో సీనియర్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బరిలోకి దిగనున్నాడు. ఈ ఒక్క మార్పు మినహా ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఆడిన టీంతోనే ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. 2019లో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులోనే ఆర్చర్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
అతడు చివరగా 2021లో భారత్ పై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత గాయాల బారిన పడడం, ఫిట్నెస్ సమస్యలతో టెస్టులకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ ఈ టెస్టు మ్యాచుతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.









