Janasena Contesting Telangana Municipal Polls | జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. మున్సిపల్ మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు తెలంగాణ అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్. తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రాం.
ఎన్నికలకు తక్కువ సమయమే ఉన్నప్పటికీ సాధ్యమైనాన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను తెలంగాణ పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేర వేయడం తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తాళ్లూరి రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.








