Jammu and Kashmir Assembly Erupts Over Article 370 | నూతనంగా కొలువుదీరిన జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) అసెంబ్లీలో సభ్యులు బాహాబాహికి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
గురువారం జమ్మూ అసెంబ్లీ సమావేశాలు మొదలయిన వెంటనే ఇంజినీర్ రషీద్ ( Engineer Rashid ) సోదరుడు, ఎమ్మెల్యే ఖుర్షిద్ అహ్మద్ షేక్ ( Khurshid Ahmad Sheikh ) ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ నేత సునీల్ శర్మ ( Sunil Sharma ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన మార్షల్స్ ( Marshals ) ఎమ్మెల్యేలను విడదీశారు. కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను బయటకు పంపారు.
ఈ ఘటన పట్ల బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.మరోవైపు ఆర్టికల్ 370, 32ఎ ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పీడిపీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. అంతేకాకుండా ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.