Sunday 1st March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని

‘యుద్ధం మొదలైంది’..ట్రంప్ vs ఖమేని

Israel vs Iran | ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ను హెచ్చరించడం, ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని దీటుగా బదులివ్వడం సంచలనంగా మారింది.

కాగా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనీయమని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని బేషరతుగా లొంగిపోయి, అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేయాలని హెచ్చరించారు.

ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో, ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసని, అవసరమైతే ఆయనను లక్ష్యంగా చేసుకోగలమని హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తే, అమెరికా సైనిక శక్తిని “ఊహించని స్థాయిలో” ఉపయోగిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

అణు ఒప్పందం కుదుర్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన ఇరాన్‌ను బెదిరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడులకు “కఠినమైన స్పందన” ఉంటుందని హెచ్చరించారు. “నమీ” అనే పేరుతో యుద్ధం ప్రారంభమైందని ప్రకటించారు. మేం బలంగా ప్రతిస్పందిస్తాం..ఎవరైపైనా దయ చూపేదే లేదని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటించారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions