Sunday 27th April 2025
12:07:03 PM
Home > తాజా > KBK Groupలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం!

KBK Groupలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం!

womens day at kbk group
  • ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటి, ఇండ్ ఫేమ్ సీఈవో గీతా భాస్కర్
  • కేబీకే గ్రూప్ ఉద్యోగినులతో మహిళా సాధికారతపై దిశానిర్దేశం

కపోతం, హైదరాబాద్: వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న కేబీకే గ్రూప్ (KBK Group) ప్రధాన కార్యాలయం, ఉప్పల్ లో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ప్రముఖ నటి, ఇండ్ ఫేమ్ సీఈవో గీతాభాస్కర్ (Geetha Bhascker) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేబీకే గ్రూప్ హెచ్ ఆర్ డైరెక్టర్ జయ వైష్ణవి (Jaya Vyshnavi) పూల బొకేతో గీతా భాస్కర్ స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా గీతా భాస్కర్ కేబీకే గ్రూప్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగినులతో ముచ్చటించారు.

మహిళా సాధికారత, ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో రాణించడానికి అనుసరించాల్సి వ్యూహాలు,నేర్చుకోవాల్సిన అంశాలపై కీలక సూచనలు చేశారు. పోటీ ప్రపంచంలో ఉనికిని చాటుకోవాలంటూ నిత్య విద్యార్థిలా ఉండాలనీ, కొత్త విషయాలు నేర్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.

చివరగా మహిళ జీవితం కథాంశంగా కేబీకే ఎంటర్టైన్మెంట్స్ (KBK Entertainments), భవ్యాస్ మీడియా (Bhavyas Media) సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సప్తవర్ణాలు’ ఇండిపెండెంట్ సినిమా పోస్టర్ ను గీతా భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా గ్లింప్స్ ని వీక్షించి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

You may also like
kbk group
కేబీకే గ్రూప్ ఖాతాలో మరో అవార్డు!
Kakkireni Bharath Kumar
KBK Group Chairman భరత్ కుమార్ కక్కిరేణికి విజనరీ లీడర్ అవార్డ్!
Kakkireni Bharath Kumar
KBK Group అధినేత భరత్ కుమార్ కు మరో అరుదైన ఘనత!
కేబీకే వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాథలకు అన్నదానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions