Indian Navy Tests INS Surat In Arabian Sea | జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ తరుణంలో భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారత్ నుండి వచ్చే దాడులను ఎదురుకోవాలని పాకిస్థాన్ ప్రభుత్వం తన ఆర్మిని అలెర్ట్ చేసింది. సెలవులపై వెళ్లిన సైనికులను తిరిగి రావాలని పేర్కొంది. ఈ తరుణంలో భారత నౌకాదళం యొక్క స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్, అరేబియా సముద్రంలో సీ స్కిమ్మింగ్ లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించింది.
మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (MRSAM) పరీక్షను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ నేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సముద్ర మార్గంలో రాడర్లను తప్పించుకోవడానికి అతి తక్కువ ఎత్తులో వచ్చే వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు.
70 కిలోమీటర్ల పరిధిలో సీ స్కిమ్మింగ్ టార్గెట్లను నిరోధించగల సామర్థ్యం దీని సొంతం. 75% స్వదేశీ సాంకేతికతతో దీన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యానికి క్షిపణి పరీక్ష గర్వ కారణం అని నేవి పోస్టు చేసింది.
మరోవైపు తాము కూడా సర్ఫెస్ టూ సర్ఫేస్ క్షిపణి ప్రయోగం చేపట్టనున్నట్లు పాకిస్థాన్ నోటీసులు జారీ చేసింది. కరాచీ తీరంలో ఏప్రిల్ 24, 25 తేదీల్లో చెపడుతామని వెల్లడించింది. ఇదే సమయంలో ఐఎన్ఎస్ సీ స్కిమ్మింగ్ ను నిర్వహించి పాక్ కు గట్టి సంకేతం పంపింది.