I Bomma Ravi News Latest | ఐ బొమ్మ రవి కేసుకు సంబంధించి హైదరాబాద్ సీపీ సజ్జనర్ నేరుగా రంగంలోకి దిగారు. సినిమా పైరసీ విషయంలో ఐ బొమ్మ రూపకర్త అయిన రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. కేవలం సినిమా పైరసే కాకుండా రవిపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీ ల్యాండరింగ్ కేసులు సైతం నమోదయ్యాయి. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
అయితే పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ రవి సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. అతని నుండి సమాధానాలు ఆశించిన మేర రావడం లేదని సమాచారం. దింతో హైదరాబాద్ సీపీ సజ్జనర్ నేరుగా రంగంలోకి దిగారు. శనివారం సీసీఎస్ కు వెళ్లిన సజ్జనర్ రవిని విచారించారు. ఇందులో భాగంగా పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. రవి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ల పాస్వర్డ్లు అడగగా రవి నిరాకరించినట్లు, ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్ల సహాయంతో పోలీసులు డేటాను వెలికితీస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే ఐ బొమ్మ ద్వారా బెట్టింగ్ యాపులను రవి ప్రమోట్ చేశారు అని పోలీసులు పేర్కొన్నారు. ఇందుకోసం రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఈ క్రమంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ కావడంతో ఈ కేసును సీఐడీ టేకప్ చేయనుంది.









