I Bomma Ravi Latest | పైరసీ మూవీల ప్రధాన సూత్రధారి, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెల్సిందే. గతంలో రవి విసిరిన సవాల్ ను స్వీకరించిన పోలీసులు కచ్చితమైన ప్రణాళికతో అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఐ బొమ్మ రవి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. అలాగే అతడి పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో రవికి మద్దతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆయన చేసిందాంట్లో తప్పేమీ లేదని వాదిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ఆటో వెనకాల పోస్టర్ వైరల్ గా మారింది. ఐ బొమ్మ రవి ఫోటోను ఆటో వెనకాల ముద్రించిన సదరు వ్యక్తి ‘రవి తెలంగాణ రియల్ హీరో’ అని కొటేషన్ రాసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.









