Hydra Commissioner Ranganath | జీహెచ్ఎంసీ ( GHMC )పరిధిలో చెరువులు, కుంటలు మరియు పార్కులను ఆక్రమించి నిర్మాణాలు చెప్పట్టిన బడబాబులపై హైడ్రా ( HYDRA ) ఉక్కుపాదం మోపుతోంది.
హైడ్రా కమీషనర్ రంగనాథ్ ( Commissioner Ranganath ) అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది.
మధురానగర్ లోని రంగనాథ్ ఇంటివద్ద అదనంగా ఔట్ పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెరువులను కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలను రంగనాథ్ నేలమట్టం చేస్తున్నారు.
దింతో ఆయన భద్రతకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ క్రమంలో ఆయన పటిష్ట బందోబస్తు ను ఏర్పాటు చేశారు.