Hyderabad police commissioner warns against drunk driving ahead of New Year | న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178 ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
వాహనం నంబర్, టైం మరియు ప్లేస్ అలాగే రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ ను హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 కు పంపించాలని సూచించారు. ఇకపోతే న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో బుధవారం రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు.









