Haryana Govt Files Case Against Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )యమునా నది కలుషితంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హర్యానా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే యమునా నదిని కలుషితం చేస్తుందని ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే యమునా నదిలో పారిశ్రామిక వ్యర్ధాలను డంప్ చేస్తుందన్నారు.
ఇలా నదిలో విషం కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తుందని సోమవారం కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్ పై ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు హర్యానా రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ ప్రకటించారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యల మూలంగా హర్యానా, ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా కన్నెర్ర చేశారు.
యమునా నది నీటినే ప్రధాని తాగుతున్నారు, అలాంటి నదిలో హర్యానా బీజేపీ ప్రభుత్వం విషం కలుపుతుందా అంటూ ప్రధాని నిప్పులుచేరిగారు.