Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > పుష్కరాల కోసం ఏపీకి రూ.100 కోట్లు..తెలంగాణకు గుండు సున్నా

పుష్కరాల కోసం ఏపీకి రూ.100 కోట్లు..తెలంగాణకు గుండు సున్నా

Harish Rao News | భారతీయ జనతా పార్టీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) లపై మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు ( Harish Rao ). 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం రూ.100 కోట్లను విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో స్పందించారు హరీష్ రావు. ఏపీకి రూ.100 కోట్లిచ్చిన కేంద్రం తెలంగాణలో జరగబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మాత్రం కేటాయించింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు.

తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ హక్కులు మరియు నిధుల కేటాయింపు కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విఫలమయ్యాయని విమర్శించారు.

లోక్సభ లో బీఆరెస్ ఎంపులే గనుక ఉంటే ఈ అన్యాయం పై కచ్చితంగా పోరాడేవారని పేర్కొన్నారు. యూనియన్ బడ్జెట్ లో కూడా ఏపీకి రూ.15 వేల కోట్లు కేటాయిస్తే తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ పట్ల మరోసారి నిర్లక్ష ధోరణి మొదలైందని, ఈ పక్షపాతం ఎందుకని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను చూడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

You may also like
జమ్మూ జయహో..67 ఏళ్ల నిరీక్షణకు తెర!
రాష్ట్రంలో భారీ పేలుడు..భారీగా మృతులు
మెప్పు కోసం గొప్పలకు వెళ్లొద్దు..మంచు సందేశం
ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్..ఏం జరగనుందో!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions