Harihara Veeramallu Latest | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా హరిహర వీరమల్లు. జులై 24న ఈ మూవీ విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం మూవీకి సంబంధించి ప్రెస్మీట్ నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ను నటి నిధి అగర్వాల్ తన భుజాలపై వేసుకున్నారని ప్రశంసించారు. ఆమెను చూసి తనకు బాధ అనిపించిందన్నారు.
బిజీ షెడ్యూల్ లోనూ నిధి ప్రమోషన్స్ చేయడం చూసి తనకే సిగ్గనిపించిందని పవన్ కళ్యాణ్ సరదాగా చెప్పారు. ఒక సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో యుద్ధాలు చేయాలని, హరిహర వీరమల్లు విషయంలోనూ చాలా ఒడుదొడుకులు ఎదురుకున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయాల మూలంగా సినిమా షూటింగ్ కోసం సమయం కేటాయించలేకపోయినట్లు, అయినప్పటికీ తన బెస్ట్ ఇచ్చినట్లు చెప్పారు. కోహినూర్ వజ్రం చుట్టూ మూవీ కథ తిరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.









