Former Minister Harish Rao’s father passes away | మాజీ మంత్రి, బీఆరెస్ సీనియర్ నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. ఈ క్రమంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ బావతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
విషయం తెలిసిన వెంటనే హరీష్ కు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సత్యనారాయణ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హైదరాబాద్ లోని క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని ఉంచారు.
కేసీఆర్ సతీమణి శోభ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.









