FIR on Alms | మనకు రోజువారీ జీవితంలో ఏదైనా నగరంలో ప్రయాణిస్తున్నప్పుడూ లేద ఏవైనా ప్రార్థనా స్థలాలకు వెళ్లినప్పుడు యాచకులు ఎదురవుతుంటారు. చాలా మంది శక్తి మేరకు వారికి డబ్బు దానం చేస్తుంటారు. దీంతో కొంత మంది భిక్షమెత్తుకుంటూనే కోట్లు సంపాదించిన వారు ఉన్నారు.
ఇదిలా ఉండగా, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పాలక వర్గం నగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిద్దాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇండోర్‌లో ఉన్న యాచకులను గుర్తించి వారిని ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
అయినప్పటికీ అక్కడ ఇంకా కొంత మంది యాచకులు మాత్రం భిక్షమెత్తుకుంటూనే ఉన్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అక్కడ కొత్త ఆంక్షలు విధించింది. అడుక్కునే వారిపై కాకుండా.. వారికి దానం చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాడానికి సిద్ధమైంది.
2025 జనవరి 1 నుంచి యాచకులకు దానం చేసే వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయబోతుంది. ఇండోర్‌లో భిక్షాటనను నిషేధిస్తూ పరిపాలన శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఇండోర్ వెళితే పొరపాటున కూడా భిక్షం వేయకండి. లేకపోతే జైలుకెళ్లాల్సిందే!!