Empty Chair For Arvind Kejriwal | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ ( AAP ) నాయకురాలు అతిశీ ( Atishi ) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.
పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచి, ఆమె మరో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. ఈ రకంగా మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal ) పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తను రామాయణంలో భరతుడికి ఎదురైన పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లు పేర్కొన్నారు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు రాజ్యాన్ని పాలించాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి కుర్చీ అర్వింద్ కేజ్రీవాల్ ది, మరో నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజామోదం పొంది తిరిగి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని సీఎం అతిశీ ధీమా వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ తిరిగివచ్చే వరకు కుర్చీ ఇక్కడే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.