Drunk Driver Threatens Cop With ‘Dead’ Snake In Hyderabad | పామును చూపిస్తూ తన ఆటోను వదిలేయాలని పోలీసును బెదిరించిన వ్యక్తి తాజగా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జనవరి 3న జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పహాడీషరీఫ్ కు చెందిన 23 ఏళ్ల సయ్యద్ ఇర్ఫాన్ ట్రాఫిక్ పోలీసును బెదిరించాడు. బ్రీత్ అనలైజట్ టెస్టు నిర్వహించగా ఇర్ఫాన్ మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది, 150 పాయింట్ల రీడింగ్ వచ్చింది. దింతో పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో తన ఆటోలో నుండి పామును తీసుకువచ్చిన ఇర్ఫాన్ పోలీసులను బెదిరించాడు. ఆటోను వదిలెయ్యాలి లేదంటే పామును వదిలేస్తా అని హంగామా సృష్టించాడు. అనంతరం ఘటన స్థలం నుండి పారిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. తాజగా పోలీసులకు క్షమాపణలు కోరుతూ ఇర్ఫాన్ ఒక వీడియోను విడుదల చేశాడు. పోలీసుల ముందే ఈ వీడియోను రికార్డు చేశారు. ఇంకెప్పుడు మద్యం సేవించనని, ఆటో నడపడం కూడా వదిలేస్తానని హామీ ఇచ్చాడు. పాముతో పోలీసులను బెదిరించడం తప్పు అని ఒప్పుకుని క్షమించాలని వేడుకున్నాడు.









