Drunk and Drive Test | దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముగిశాయి. తెలంగాణ విషయానికి వస్తే ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడంతో మందుబాబులు చాలా జాగ్రత్త పడ్డారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కొందరు మందుబాబులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇదే సమయంలో హన్మకొండలో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా పోలీసులే ఆశ్చర్యపోయారు. ఏకంగా 432 పాయింట్ల రీడింగ్ ను చూసి షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. 2025 సంవత్సరంలో ఇదే అత్యధిక రీడింగ్ అని పోలీసులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో అసలు ఆ వ్యక్తి ఎంత మద్యం తాగితే ఇంతలా రీడింగ్ చూపించింది అని నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వనస్థలీపురంలో మరో వ్యక్తి నడిరోడ్డుపై హంగామా చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు సందర్భంగా తనపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై అడ్డంగా పడుకున్నాడు. ఈ ఆరోపణలను ట్రాఫిక్ పోలీసులు ఖండించి, సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.









