Sunday 1st March 2026
12:07:03 PM
Home > సోషల్ -వైరల్ > సింహాలను తరిమికొట్టిన కుక్కలు.. వీడియో వైరల్!

సింహాలను తరిమికొట్టిన కుక్కలు.. వీడియో వైరల్!

Dogs Vs Lions Video | గుజరాత్ లోని అమ్రేలిలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రెండు గ్రామ సింహాలు, అడవి సింహాలను (Dogs Vs Lions) తరిమి కొట్టాయి.

ఆసియాటిక్ సింహాలకు ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ గిర్ నేషనల్ పార్క్‌ (Gir National Park) కు 70 కిలోమీటర్ల దూరంలో సావర్‌కుండ్లా (Savar Kundla) లోని గోశాల వద్దకు అర్ధరాత్రి రెండు సింహాలు వచ్చాయి.

గోశాల గేట్ బయట తిరుగుతున్నాయి. గేట్ లోపల ఉన్న కుక్కలు వాటిని గమనించి మొరుగుతూ వాటిని అడ్డుకున్నాయి. వాటిని ఎదుర్కొంటూ లోపలికి రాకుండా తరిమికొట్టాయి. సింహాలు, కుక్కల మధ్య కొద్దిసేపు తీవ్ర పోరు జరిగింది.

సింహాలు వెళ్లిపోయిన తర్వాత ఓ కుక్క బయటికి వచ్చి మరీ చూసి వెళ్లడం గమనార్హం. ఆ గేటు వద్ద అమర్చిన సీసీ కెమెరాలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
తెలంగాణ ఉద్యమకారులకు శుభవార్త.. హైకోర్టు కీలక తీర్పు!
vc sajjanar
పెళ్లి పేరుతో మోసాలు.. అమ్మాయిలూ.. బీ కేర్‌ఫుల్: సీపీ సజ్జనర్!
old tractor makes a man millionaire overnight
పనికి రాని పాత ట్రాక్టర్ రాత్రికి రాత్రేకోటీశ్వరుడిని చేసింది.. ఎలాగో తెలుసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions