Director Prashanth Neel About Salaar-2 | ‘సలార్-1 సీజ్ ఫైర్’ ( Salaar-1 Ceasefire ) తనకు సంతోషం కలిగించలేదని దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) చెప్పారు. సలార్ పార్ట్ వన్ లో కొన్ని సీన్లలో కేజీఎఫ్ ( KGF ) ఛాయలు కనిపించినట్లు పేర్కొన్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా ఏడాది క్రితం రిలీజ్ అయిన ‘సలార్-1 సీజ్ ఫైర్’ రూ.700 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ క్రమంలో ‘సలార్-2 శౌర్యంగ పర్వం’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇందులో సలార్-1 మీకు సంతోషాన్ని ఇచ్చిందా? అని ప్రశ్నించగా సలార్-1 రిజల్ట్ ( Result ) తో తాను సంతృప్తిగా లేనట్లు దర్శకుడు పేర్కొన్నారు. పడిన కష్టంతో పోల్చితే సినిమా తనకు సంతోషాన్ని ఇవ్వలేదన్నారు.
అయితే సలార్-2 మాత్రం అలా ఉండదని తన కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ ( Best Film ) గా ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. అభిమానుల ఊహకు కూడా అందని విధంగా పార్ట్-2 ఉంటుందని చెప్పారు.
ఎవరూ ప్రశ్నించలేని విధంగా సలార్-2 ఉండబోతున్నట్లు, బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుందని ఆయన చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇదిలా ఉండగా సలార్-2 విడుదలకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.