Deputy CM Pawan Kalyan Visits Kakinada Port Over PDS Rice Issue | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన ఆసక్తిగా సాగింది.
కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యాన్ని ( PDS Rice ) అక్రమంగా రవాణా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని పవన్ నిలదీశారు. తాను ఇక్కడికి పరిశీలనకు వచ్చే సమయంలో SP లీవ్ ( Leave ) లో వెళ్లడం అనుమానంగా ఉంది, SP ఎందుకు ఇక్కడ లేరని పోర్టు పరిశీలన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనది, తీర ప్రాంతం ఎంత బలమో అంత బలహీనం కూడా అని పేర్కొన్నారు.అధికారులను వివరాలు అడుగుతుంటే అర్థం లేని సమాధానాలు ఇస్తున్నారని, షిప్ ( Ship ) లోకి వెళ్లకుండా అక్కడే తిప్పుతూ ఉన్నారని, ఖచ్చితంగా అందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈజ్ ఆఫ్ బిజినెస్ ( Ease Of Doing Buisness ) అంటే స్మగ్లర్లకు ఈజ్ ఆఫ్ బిజినెస్ లా ఉండకూడదు, కాకినాడ లో అధికారులు స్మగ్లింగ్ కు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.
పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుండి రావని గ్యారెంటీ ఏంటి? కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం లేదా? దీనిపైన జిల్లా SP వెంటనే వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.