Dead Body Found In Parcel | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వచ్చిన పార్శిల్ ను ఓపెన్ ( Open ) చేసి చూస్తే అందులో మృతదేహం ఉంది.
డెడ్ బాడీ ( Deadbody )ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. యండగండి గ్రామంలో సాగి తులసి అనే మహిళ ప్రభుత్వం నుంచి మంజూరైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంటున్నారు.
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం ఆమె క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో క్షత్రియ సేవా సమితి టైల్స్ ( Tiles ) ను పంపించింది. ఆ తర్వాత మహిళ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ సామగ్రి పంపిస్తామని వారు బదులిచ్చారు. అయితే తాజాగా ఇంటికి ఓ పార్శిల్ ( Parcel )వచ్చింది.
అందులో సగం డెడ్ బాడీ ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. డెడ్ బాడీతో పాటు ఒక లెటర్ కూడా లభించింది. రూ.1.30 కోట్లు చెల్లించాలి లేకపోతే ఇబ్బందుకు తప్పవు అని రాసి ఉంది. వెంటనే తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.