Daughters Fullfill Father Dream | తెలంగాణలో దంగల్ సినిమా రిపీట్ అయ్యింది. తండ్రి కలను కుమార్తెలు నిజం చేశారు. కొడంగల్ మండలం హుస్నాబాద్ కు చెందిన శ్రీశైలం గౌడ్ ఒక రైతు.
టీచర్ జాబ్ సాధించాలని శ్రీశైలం, నిరంతరం శ్రమించారు. అయితే దురదృష్టవశాత్తు ఆయన ఉద్యోగం సాదించలేకపోయారు. కానీ తండ్రి సాదించలేకపోయిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అతని ఇద్దరు కుమార్తెలు సాధించారు.
కుమార్తెలు సుధ, శ్రీకావ్యాలు ఉద్యోగం కోసం తండ్రి పడిన శ్రమను ప్రత్యక్షంగా చూశారు. తండ్రి కలను నిజం చేయాలని భావించారు. సుధ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి పూర్తి చేయగా, శ్రీకావ్య డీఎడ్ పూర్తిచేసింది.
పాఠశాల విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతూ డీఎస్సి కోసం రోజూ 14 నుండి 18 గంటలు కష్టపడేవారు. స్కూల్ అసిస్టెంట్ మాథ్స్, ఫిజికల్ సైన్స్ కోసం సిద్ధమైన సుధ మాథ్స్ లో రెండవ ర్యాంకు, ఫిజికల్ సైన్స్ లో మొదటి ర్యాంకు సాధించారు. మరోవైపు శ్రీకావ్య ఎస్జీటీగా ఎంపికయ్యారు.
ఈ నేపథ్యంలో బుధవారం సీఎం రేవంత్ చేతుల మీదుగా హైదరాబాద్ లో నియామక పాత్రలు అందుకున్నారు.