Dasara Holidays In AP | దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి.
అయితే ఉపాధ్యాయుల కోరిక మేరకు సెప్టెంబర్ 22 నుంచే సెలవులు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి లేఖను రాశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ స్పందించి సెలవులపై గుడ్ న్యూస్ చెప్పారు.
పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.









