Cricketer David Warner’s look from Robinhood | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహించి తెలుగు యువతకు దగ్గరయిన డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు పాటలకు, స్టెప్పులకు వార్నర్ చేసిన రీల్స్ ఎంతగానో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అనంతరం నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ కీ రోల్ లో నటిస్తున్నారు.
ఈ క్రమంలో వార్నర్ కు సంబంధించిన లుక్ ను తాజగా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. బౌండరీ నుండి బాక్సాఫీస్ కు వస్తున్న వార్నర్ కు ఇండియన్ సినిమాలోకి స్వాగతం అని మూవీ టీం పేర్కొంది.