Constable Nagamani News | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో అక్కను అత్యంత కిరాతకంగా తమ్ముడు హతమార్చాడు.
సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం జరగగా, పది నెలల క్రితం విడాకులు తీసుకున్నారు.
అనంతరం నవంబర్ 1న రాయపోలు గ్రామానికి చెందిన శ్రీకాంత్ ను యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. వీరిది కులాంతర ప్రేమ వివాహం. ఆదివారం సెలవు కావడంతో నాగమణి దంపతులు రాయపోలు గ్రామానికి వెళ్లారు.
సోమవారం తిరిగి హయత్ నగర్ వస్తుండగా ఎండ్లగూడ వెళ్లే రహదారిపై కారుతో ఢీ కొట్టి అనంతరం వేట కొడవలితో నరికేశారు. సోదరి కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని సోదరుడే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.