Congress MP Sudha’s Gold Chain Snatched In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా ఎంపీకి షాకింగ్ ఘటన ఎదురైంది.
మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ దొంగ తన మెడలోని గొలుసును లాక్కొని పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమిళనాడుకు చెందిన ఎంపీ, కాంగ్రెస్ నేత సుధా రామకృష్ణన్.
తమిళనాడు మయిలాదుతురై నుంచి లోక్‌సభ సభ్యురాలైన సుధా రామకృష్ణన్, ఈ ఘటన చాణక్యపురిలోని డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని పోలండ్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగినట్లు సోమవారం ఉదయం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తోటి ఎంపీ, డీఎంకే సభ్యురాలు రజతితో కలిసి నడుస్తుండగా ఓ దొంగ తన గొలుసును లాక్కెళ్లినట్లు పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సదరు ఎంపీ ఓ లేఖ రాశారు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే చాణక్యపురి వంటి ప్రాంతంలో పార్లమెంటు సభ్యురాలికే రక్షణ లేకపోతే ఇక సాధారణ పౌరులకు రక్షణ ఎలా కల్పిస్తారని అమిత్ షాకు రాసిన లేఖలో ఎంపీ సుధా రామకృష్ణన్ పేర్కొన్నారు.









