Sandeep Raj Marries Chandini Rao | కలర్ ఫోటో (Colour Photo) సినిమాతో విమర్శలకు ప్రశంసలు అందుకున్న టాలీవుడ్ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj), హీరోయిన్ చాందీనీ రావు (Chandini Rao) పెళ్లి చేసుకున్నారు.
తిరుమలలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సందీప్ రాజ్, చాందీనీ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ వేడుకు కలర్ ఫోటోలో నటించిన హీరో సుహాస్ (Suhas), నటుడు వైవా హర్ష (Viva Harsha) తదితురులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సందీప్ రాజ్ తొలి చిత్రం కలర్ ఫోటో సినిమాలో చాందినీ రావు కీలక పాత్ర పోషించారు. ఆ చిత్రంతో వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలపడంతో శనివారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
సందీప్ రాజ్ ప్రస్తుతం రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.