CM siddaramaiah has extended support to flood hit Himachal Pradesh | హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ప్రళయం సృష్టించాయి.
వరదల మూలంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో సహాయం చేసేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ లో ప్రజల పునరావాసం మరియు సహాయం కోసం రూ.5 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.
ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవింధర్ సింగ్ సుక్కు కు లేఖ రాశారు. హిమాచల్ ప్రదేశ్లో వచ్చిన వినాశకరమైన వరదలు అనేక ప్రాణాలు, ఇళ్లు మరియు జీవనోపాధులను నాశనం చేశాయని సీఎం సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు ఈ విషాద సమయంలో హిమాచల్ ప్రజలతో సంఘీభావంగా నిలబడతారని పేర్కొన్నారు.









