CM Revanth Reddy Set For Match With Messi | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఫుట్బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సి తలపడేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 13న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మెస్సి ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రాక్టీస్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో సీఎం ఇతర ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే డిసెంబర్ 8, 9న తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగనున్న విషయం తెల్సిందే. చివరగా డిసెంబర్ 13 న ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గడం లియోనెల్ మెస్సీ పాల్గొనబోయే ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఫుట్‌బాల్ మ్యాచ్‌తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా గోట్ ఇండియా టూర్-2025లో భాగంగా మెస్సి భారత్ లో పర్యటించనున్నారు.









