CM Revanth Reddy News | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం అని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రంప్ ఒకరోజు మోదీ తన ఫ్రెండ్ అని అంటాడని.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు, ఆయనను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (PAFI) 12వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇష్టరాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారని పేర్కొన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదని విమర్శించారు.









