CM Revanth Reddy Football Practice In Woxsen University | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోరుగా ఫుట్బాల్ సాధన చేస్తున్నారు. అర్జెంటీనా లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సి శనివారం హైదరాబాద్ కు రానున్న విషయం తెల్సిందే. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సికి ప్రత్యర్థిగా సీఎం రేవంత్ బరిలోకి దిగనున్నారు.
ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా సమయం దొరికినప్పుడల్లా సీఎం ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్లోని వొక్సేన్ యూనివర్సిటీని సందర్శించారు. మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి యూనివర్సిటీలో విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు. వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. యూనివర్సిటీ ఫుట్బాల్ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఫుట్ బాల్ తనకు ఇష్టమైన ఆట అని టీం స్పిరిట్ ను ప్రదర్శించాల్సిన క్రీడ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ టీంకు లీడర్ గా నాలుగు కోట్ల ప్రజలను గెలిపించాలన్న తపన నిత్యం తనలో ఉంటుందన్నారు.









