Sunday 20th April 2025
12:07:03 PM
Home > తాజా > ‘భూభారతి వెబ్‌సైట్‌..100 ఏళ్ళుపాటు నడిచేలా రూపొందించండి’

‘భూభారతి వెబ్‌సైట్‌..100 ఏళ్ళుపాటు నడిచేలా రూపొందించండి’

CM Revanth Reddy About Bhu Bharati Portal | సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి భూ భారతి పథకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

భూ భారతి వెబ్‌సైట్ సరళంగా, పారదర్శకంగా ఉండాలని, భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా దాన్ని రూపొందించాలని సూచించారు.

మరోవైపు ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద మూడు మండలాల్లో భూభారతిని అమలు చేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2 నాటికి తెలంగాణ వ్యాప్తంగా ఇది అమలు కానుందని వెల్లడించారు.

You may also like
‘విమానం దారి మళ్లింపు..ఢిల్లీ విమానాశ్రయం సీఎం పై ఆగ్రహం’
‘పెళ్లికూరుతు స్థానంలో ఆమె తల్లి..షాకయిన వరుడు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions