Chintamaneni Prabhakar News | ఏపీ ( Andhra Pradesh )లోని దెందులూరు ( Denduluru ) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పేద బాలికలకు ఉపయోగపడేలా ఓ కొత్త ఆలోచనను అమలు పరిచారు.
సాధారణంగా రోజూ ప్రజాప్రతినిధులను కలవడానికి వచ్చిన వారు బొకేతోపాటు, శాలువాలు ( Shawls ) కప్పుతుంటారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులకు రోజు వందల సంఖ్యలో శాలువాలు వచ్చి చేరుతుంటాయి. అవి తర్వాత ఏమయ్యాయో కూడా పట్టించుకోరు.
అయితే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆ శాలువాలను బాలికలకు ఉపయోగపడేలా మార్చారు. ఆ శాలువాలతో నిరుపేద బాలికల కోసం డ్రెస్సులు కుట్టించారు.
క్రిస్ మస్ సందర్భంగా తల్లిదండ్రులు లేని చిన్నారులు, హాస్టళ్లలో ఉండే పేద విద్యార్థినిలకు అందించారు. దీంతో ఎమ్మెల్యే ఆలోచనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.