Saturday 28th February 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఉల్టా పానీ’ అద్భుతం..మీరు అక్కడికి వెళ్ళండి

‘ఉల్టా పానీ’ అద్భుతం..మీరు అక్కడికి వెళ్ళండి

Chhattisgarh’s hidden gem where water defies gravity | కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

నీరు పల్లమెరుగు అనే విషయం తెల్సిందే. కానీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో మాత్రం నీరు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుందని కేంద్రమంత్రి తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను సైతం షేర్ చేశారు. ఛత్తీస్‌గఢ్ నిజంగా అద్భుతమైనదని కొనియాడారు.

ఛత్తీస్‌గఢ్ కేవలం ప్రకృతి సౌందర్యంతోనే కాకుండా, ప్రకృతి యొక్క అద్భుతమైన వింతలతో కూడా సమృద్ధిగా ఉందన్నారు. అలాంటి ఒక అద్భుతం ‘ఉల్టా పానీ’ రూపంలో మైన్‌పాట్‌ అనే ప్రాంతంలో మనకు కనిపిస్తుందని పేర్కొన్నారు.

ఇక్కడ నీరు పై నుండి కిందికి కాకుండా, కింది నుండి పైకి ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుందని, తాను అక్కడ ఒక కాగితం నావను కూడా వదిలేస్తే, అది కూడా కింది నుండి పైకి వెళ్లడం ప్రారంభించిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాహనాన్ని న్యూట్రల్ గేర్‌లో వదిలేస్తే, అది కూడా స్వయంగా పైకి వెళ్లిపోయిందని చెప్పారు.

నీరు ఇలా వ్యతిరేక దిశలో ప్రవహించడాన్ని తన జీవితంలోనే మొదటి సారి చూసినట్లు ఇది నిజంగా గొప్ప అనుభూతని ప్రకృతి వింత గురించి పంచుకున్నారు.

ఈ దృశ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లు, దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈ రహస్యం నిజంగా అద్బుతమన్నారు. పర్యాటకులు ఒక్కసారి ఇక్కడకు తప్పక వచ్చి ఈ అద్భుతాన్ని చూడాలని కేంద్రమంత్రి కోరారు.

You may also like
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్..స్పందించిన పవన్
వివాహేతర సంబంధం..విడాకులు కోరిన విజయ్ భార్య
భర్త సీఎం..భార్య ఎమ్మెల్యే..అసెంబ్లీలోనే ప్రశ్నించిన సతీమణి!
లిక్కర్ కేసులో కవితకు రిలీఫ్..కేటీఆర్ ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions