Cheetah Spotted In Srisailam | శ్రీశైలం శివారులో చిరుత సంచరిస్తుండడం కలకలం రేపుతోంది. ఓ పూజారి ఇంటి ఆవరణలో తాజగా చిరుత కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం కూడా చిరుత ఈ పూజారి ఇంట్లో సంచరించింది. పాతాళగంగ మెట్ల వైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడంతో ముందస్తు జాగ్రతలో భాగంగా బయట సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి సత్యనారాయణ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దింతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కృష్ణానది తీరం, శివారు ప్రాంతం అవ్వడంతో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ఏడాది క్రితం అంటే జనవరి 6 2025లో కూడా సత్యనారాయణ ఇంటి ప్రాంగణంలోకి చిరుత వచ్చింది. ఇప్పుడు ఇది రెండవ సారి.









