Monday 12th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కేరళలో ప్రమాదం.. ఫ్లై ఓవర్ నుంచి కిందకి వేలాడిన కారు.. వీడియో వైరల్!

కేరళలో ప్రమాదం.. ఫ్లై ఓవర్ నుంచి కిందకి వేలాడిన కారు.. వీడియో వైరల్!

car hangs from flyover

Car Hangs Mid Air | కేరళలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 66 పై నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ పైకి ఎక్కిన మధ్యలో ఉన్న గ్యాప్ లో చిక్కుకుపోయింది. కన్నూర్ జిల్లా తలస్సేరి-కన్నూర్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తలస్సేరి నుంచి కన్నూర్ దిశగా వెళ్తున్న కారు వార్నింగ్ బారికేడ్లను గమనించకుండా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. ఆ ఫ్లైఓవర్ రెండు సెక్షన్ల మధ్య పనులు పూర్తికాకపోవడంతో మధ్యలొ ఉన్న గ్యాప్ లో కారు పడిపోయింది.

దీంతో కారు బ్రిడ్జిపై నుంచి కిందకు వేళాడింది. డ్రైవర్ వెంటనే కారులో నుంచి బయటకు వచ్చాడు.  వెంటనే స్థానికులు, అధికారుల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టి కారును కిందకు జారకుండా నియంత్రించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like
నోకియా ఫోన్లు..2010లో ఆర్డర్ చేస్తే 2026లో డెలివరీ
పులితో పోరాడి ప్రాణత్యాగం చేసి యజమానిని కాపాడిన శునకం
delivery boy saves woman life in tn
ఓ ప్రాణం నిలబెట్టిన డెలీవరీ బాయ్..
vehicle2vehicle communication
ఇక వాహనాలూ మాట్లాడుకుంటాయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions