KTR Meets TG DGP | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పలువురు పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం డీజీపీ (TG DGP) ని కలిశారు. గురువారం తిరుమలగిరిలో కాంగ్రెస్ (Congress) నేతలు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ధర్నా శిబిరంపై చేసిన దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని విమర్శించారు. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేయడం, టెంట్ పీకేయడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరు పై, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై మరియు ఇతర జర్నలిస్టులపై దాడి చేసిన విషయంపై తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని కంప్లయింట్ చేశారు. రాజకీయ ప్రమేయం వల్ల ప్రతిపక్ష నాయకులపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు మరియు చేస్తున్న హింసపై ఫిర్యాదు చేశారు. కొండా సురేఖ (Konda Surekha) పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గురుంచి కూడా ప్రస్తావించారు.