Sunday 4th May 2025
12:07:03 PM
Home > తాజా > Breaking: గ్రేటర్ లో కీలక సభ రద్దు యోచనలో బీఆరెస్ పార్టీ.. కారణమేంటంటే!

Breaking: గ్రేటర్ లో కీలక సభ రద్దు యోచనలో బీఆరెస్ పార్టీ.. కారణమేంటంటే!

kcr news

BRS Meeting In Parade Grounds | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా పర్యటిస్తున్నారు.

రోజూ 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరవుతూ బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

అందులో భాగంగా శనివారం గ్రేటర్ లో నిర్వహించే సభలో పాల్గొనాల్సి ఉంది. నవంబర్ 25న సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ప్రజా ఆశీర్వాద సభ జరగాల్సి ఉంది.

కానీ, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ సభ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వాతావరణం సహకరిం చకపోవడం తోనే సభ రద్దు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సభ రద్దుపై అధికారికం గా ప్రకటన చేయాల్సి ఉంది.

గత రెండు రోజులుగా పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ కోసం బీఆర్ఎస్ భారీ ఏర్పా ట్లు చేస్తోం ది.

నగరంతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జన సమీకరణకు ప్లాన్ చేశారు నేతలు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా సభ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

You may also like
‘స్కూటీ దొంగిలించిన ఎద్దు’
‘ఇదేం పైత్యం..చనిపోయిన పోప్ అవతారంలో ట్రంప్’
‘వరకట్నం వద్దేవద్దు..రూ.31 లక్షలని తిరిగిచ్చేసిన వరుడు’
‘అవ్‌నీత్ కౌర్ ఫొటోకు లైక్..క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions