BJP Leaders Pays Tribute To Birsa Munda | శుక్రవారం భారతీయ జనతా పార్టీ ( BJP ) రాష్ట్ర కార్యాలయంలో ఆదివాసుల అస్తిత్వం, జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు, గిరిజన శక్తిని ఏకీకరణ చేసి బ్రిటిష్ అకృత్యాలకు వ్యతిరేకంగా మహా ఉద్యమాన్ని నడిపిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ST మోర్చా ఆధ్వర్యంలో ఆ మహనీయునిని చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు Ex MLA శ్రీ ఎండల లక్ష్మీనారాయణ ,ST మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డా కళ్యాణ్ నాయక్ ,కిషన్ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ గోలి మధుసూదన్ రెడ్డి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ గారు పాల్గొన్నారు.









