Bhumana Karunakar Reddy Makes Serious Allegations Against BR Naidu | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు కు సంబంధించినట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దింతో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ తరుణంలో టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..ఆయన బీఆర్ నాయుడు కాదు బీఆర్ కామ నాయుడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఆ వీడియోలు వచ్చిన తర్వాత తనకు తెలిసిన AI వాళ్ళతో మాట్లాడితే, ఇది ఎలాంటి ఫేక్ వీడియో కాదని నిజమైన వీడియోనే అని చెప్పినట్లు భూమన పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి పై భక్తి ఉంటే వెంటనే బీఆర్ నాయుడు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో SVBC చైర్మన్ గా ఉన్న పృధ్విరాజ్ మహిళను వాటేసుకోవాలని ఉంది అని మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిన వెంటనే అతన్ని తొలగించినట్లు చెప్పారు.










