Batting these days is way easier than 20-25 years ago: Kevin Pietersen | ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. 20-25 సంవత్సరాల క్రితంతో పోల్చితే ప్రస్తుతం బ్యాటింగ్ చేయడం చాలా సులభమని పేర్కొన్నారు.
ఇలా చెబుతున్నందుకు తనపై ఎవరూ అరవవద్దని కోరారు. కానీ అప్పట్లో వివిధ జట్ల బలమైన బౌలింగ్ లైనప్ ను ఎదుర్కొని బ్యాటింగ్ చేయడం ఇప్పటితో పోల్చితే రెండింతలు కష్టంగా ఉండేదన్నారు. ప్రస్తుతం కెవిన్ పీటర్సన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
వకార్, షోయబ్, అక్రమ్, ముస్తాక్, కుంబ్లే, శ్రీనాథ్, హర్భజన్, డొనాల్డ్, పొలాక్, క్లూసెనర్, గఫ్, మెక్‌గ్రాత్, లీ, వార్న్, గిల్లెస్పీ, బాండ్, వెట్టోరి, కెయిర్న్స్, వాస్, మురళీ, కర్ట్లీ, వాల్ష్ ఇలా చెబుకుంటూ పోతే గతంలో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్ల జాబితా కొనసాగుతుందని అన్నారు.
ఇలా గత బౌలర్లతో సరిపోలగల 10 మంది ఆధునిక బౌలర్ల పేర్లను వెల్లడించాలని పీటర్సన్ నెటీజన్లకు ప్రశ్న వేశారు. ఈ నేపథ్యంలో పీటర్సన్ పోస్టుకు కొందరు నెటిజన్లు ఏకీభవిస్తుండగా మరికొందరు మాత్రం ఆయనతో విభేదిస్తున్నారు.









