Bandi Sanjay Questions Employment of Non-Hindus in TTD | తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలో పని పనిచేస్తున్న వెయ్యికి పైగా అన్యమతస్థులను తొలగించాలని కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
శుక్రవారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..దేశ ప్రజలందరికీ శాంతి, సమృద్ధి, బలం కోసం మరియు భారత్ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
తిరుమలలో పనిచేస్తున్న అన్యమతస్థులను తొలగించి, దీర్ఘకాల తప్పును సరిదిద్దాలన్నారు. టీటీడీలో ఇప్పటికీ వెయ్యికిపైగా హిందూ కాని వారు ఎందుకు పనిచేస్తున్నారని ప్రశ్నించారు. మసీదులు లేదా చర్చిలలో హిందువులు ఎప్పుడైనా నియమించబడతారా? అని అడిగారు.
ధర్మ రక్షణలో భాగంగానే ఇలా ప్రశ్నిస్తున్నట్లు అంతేకాని ఇది ద్వేషం గురించి కాదని వివరణ ఇచ్చారు. టీటీడీ రాజకీయ వేదికగా మారకూడదని హితవుపలికారు. తెలుగు రాష్ట్రాలలో దేవాలయాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయాలను సంరక్షించడం మరియు హిందువులకు మాత్రమే విధులను అప్పగించడం వంటివి టీటీడీ లక్ష్యాలుగా ఉండలని తెలిపారు.