Bandi Sanjay On Kavitha Bail | ఢిల్లీ మద్యం పాలసీ ( Delhi Excise Policy ) కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha )కు బెయిల్ మంజూరు అయినందుకు కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) మరియు వారి న్యాయవాదులకు అభినందనలన్నారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).
వీరి అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని ఎద్దేవా చేశారు. కవిత బెయిల్ బీఆరెస్ మరియు కాంగ్రెస్ ల సంయుక్త విజయమని సెటైర్ ( Satire ) వేశారు.
తొలుత కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని అధికార కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నిక చేసిందని, సదరు న్యాయవాదిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ ( KCR ) అద్భుత రాజకీయ చతురత కనబరిచారని పేర్కొన్నారు.
బీఆరెస్ నాయకురాలు కవిత బెయిల్ పై బయటకు వచ్చిందని, కాంగ్రెస్ వ్యక్తి రాజ్యాసభకు ఎన్నికయ్యారని తెలిపారు. ఈ క్రైం ( Crime ) లో భాగస్వాములైన బీఆరెస్, కాంగ్రెస్ లకు అభినందనలు అని బండి సంజయ్ ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసారు.
కాగా ఇటీవలే కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి ( Abhishek Singhvi )ని తెలంగాణ నుండి కాంగ్రెస్ రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెల్సిందే. కవిత బెయిల్ కోసం అభిషేక్ సింఘ్వి తొలుత వాదనలను వినిపించారని బీజేపీ విమర్శిస్తోంది.