Bandi Sanjay News Latest | భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి పార్టీని విలీనం చేసేందుకు కేటీఆర్ ముందుకువచ్చారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఈ వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని పేర్కొన్నారు. దీనిపై చర్చకు సిద్ధమని, సీఎం రమేష్ ను తాను తీసుకువస్తానని కేటీఆర్ కు బండి సవాల్ విసిరారు.
2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ గెలవడానికి సీఎం రమేష్ ఆర్థిక సహాయం చేశాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మొదట కేసీఆర్, కేటీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కానీ సీఎం రమేష్ ఒప్పించిన తర్వాత కేటీఆర్ కు టికెట్ లభించిందన్నారు.
బీజేపీలో బీఆరెస్ పార్టీ విలీనం కోసం కేటీఆర్ సంప్రదింపులు జరిపారని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ అవినీతి, కుటుంబ పాలనతో కూరుకుపోయిన బీఆరెస్ ను విలీనం చేసుకునేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ కూడా తేల్చి చెప్పారని బండి వ్యాఖ్యానించారు.









